పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు | RTC bus in paddy field in guntur district | Sakshi
Sakshi News home page

పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

Oct 2 2015 5:29 PM | Updated on Sep 3 2017 10:21 AM

వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు స్టీరింగ్ విరిగిపోవడంతో.. ఒక్కసారిగా రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది.

గుంటూరు : వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు స్టీరింగ్ విరిగిపోవడంతో.. ఒక్కసారిగా రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 27 మంది ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. దాంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాలు.. గుంటూరు జిల్లా నర్సరావుపేట డిపోకు చెందిన ఆర్డినరి బస్సు ముప్పాళ్ల వెళ్తున్న సమయంలో తుంగపాడు స్టేజి సమీపంలోకి చేరుకోగానే బస్సు స్టీరింగ్ విరిగిపోయింది.

దీంతో బస్సు ఒక్కసారిగా రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. దాంతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు. అయితే ఒక్కసారిగి ఆగిపోయింది. దీంతో ప్రయాణికులంతా బస్సులోని కిందకి దిగిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement