ఆర్టీసీ బస్సు టైరు పంక్చర్ కావడంతో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది.
చంద్రగిరి(చిత్తూరు జిల్లా): ఆర్టీసీ బస్సు టైరు పంక్చర్ కావడంతో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ సంఘటన సోమవారం ఉదయం చిత్తూరు జిల్లా చంద్రగిరి కోట సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడ్డారు.
బెంగుళూరు నుంచి తిరుపతికి వస్తున్న ఆర్టీసీ బస్సు టైరు పంక్చరైంది. దాంతో అదుపు తప్పిన బస్సు బెంగుళూరు వైపు వెళుతున్న కారును ఢీకొట్టింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.