తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1100 ఆర్టీసీ బస్సులు రానున్నాయి.
కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1100 ఆర్టీసీ బస్సులు రానున్నాయి. కాలం చెల్లిన బస్సులను తొలగించి వాటి స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెడుతున్నట్టు తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ సోమవారం మీడియాకు వెల్లడించారు. ఆర్టీసీని విస్తరించి ఆదాయం పెంచుకునే దిశగా కృషి చేస్తామని చెప్పారు.
దాదాపు వెయ్యి గ్రామాలకు పైగా ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదని అన్నారు. మారుమూల ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించనున్నట్టు సోమారపు సత్యనారాయణ తెలిపారు.