రూ.760 కోట్లు ఇన్‌పుట్‌ అప్‌లోడ్‌ | Rs760 crores input input | Sakshi
Sakshi News home page

రూ.760 కోట్లు ఇన్‌పుట్‌ అప్‌లోడ్‌

Jul 1 2017 11:23 PM | Updated on Sep 5 2017 2:57 PM

పెట్టుబడిరాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ) పంపిణీలో భాగంగా శనివారం నాటికి రూ.760 కోట్ల పరిహారంకు సంబంధించి జాబితాలు అప్‌లోడ్‌ చేసినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి.

అనంతపురం అగ్రికల్చర్‌ : పెట్టుబడిరాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ) పంపిణీలో భాగంగా శనివారం నాటికి రూ.760 కోట్ల పరిహారంకు సంబంధించి జాబితాలు అప్‌లోడ్‌ చేసినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. జిల్లాకు మంజూరైన రూ.1,032.42 కోట్లలో రూ.760 కోట్లు బిల్లులు ట్రెజరీకి సమర్పించినట్లు తెలిపారు. ఇందులో రూ.500 కోట్లకు పైగా పరిహారం రైతుల ఖాతాల్లోకి జమ అయినట్లు తెలుస్తోందన్నారు. రెండు మూడు రోజుల్లో అప్‌లోడ్, పంపిణీ పూర్తీ చేయడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఆ తర్వాత మిస్‌మ్యాచింగ్‌ జాబితాలు బ్యాంకుల వారీగా సేకరిస్తామని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement