తణుకు : పెద్దనోట్ల రద్దు తర్వాత జిల్లాలో బంగారం కొనుగోళ్లపై దృష్టి సారించిన అధికారులు రూ.2.50 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.
రూ.2.50 కోట్ల విలువైన బంగారం స్వాధీనం!
Feb 12 2017 12:38 AM | Updated on Sep 5 2017 3:28 AM
తణుకు : పెద్దనోట్ల రద్దు తర్వాత జిల్లాలో బంగారం కొనుగోళ్లపై దృష్టి సారించిన అధికారులు రూ.2.50 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఈనెల 9న తణుకు పట్టణంలో కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్టు సమాచారం. పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇళ్లలో సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఓ వ్యాపారికి చెందిన బినామీ ఇంటిపై దాడిచేసి సుమారు రూ.2.50 కోట్ల విలువైన బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆ బంగారం తనది కాదని, పట్టణానికి చెందిన రియల్ వ్యాపారిది అని ఆ బినామీ వ్యక్తి చెప్పడంతో అధికారులు ఓ వ్యాపారి ఇంట్లో సోదాలు నిర్వహించారు. బంగారం విషయమై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరినట్టు సమాచారం.
Advertisement
Advertisement