రూ.185 కోట్ల నగదు సరఫరా | rs.185 crores cash suppli | Sakshi
Sakshi News home page

రూ.185 కోట్ల నగదు సరఫరా

Jan 7 2017 11:37 PM | Updated on Sep 5 2017 12:41 AM

ఆర్‌బీఐ నుంచి శనివారం జిల్లాకు రూ.185 కోట్ల నగదు సరఫరా అయినట్లు లీడ్‌ బ్యాంకు జిల్లా మేనేజర్‌ (ఎల్‌డీఎం) జయశంకర్‌ తెలిపారు.

అనంతపురం అగ్రికల్చర్‌ : ఆర్‌బీఐ నుంచి శనివారం జిల్లాకు రూ.185 కోట్ల నగదు సరఫరా అయినట్లు లీడ్‌ బ్యాంకు జిల్లా మేనేజర్‌ (ఎల్‌డీఎం) జయశంకర్‌ తెలిపారు. ఎస్‌బీఐతో పాటు ఆంధ్రాబ్యాంక్‌ కరెన్సీ చెస్ట్‌కు నగదు చేరిందన్నారు. ఎక్కడా నో క్యాష్‌ బోర్డులు పెట్టకుండా గరిష్ట మొత్తం విత్‌డ్రాలు చేస్తున్నట్లు తెలిపారు. ఏటీఎం సేవలు కూడా పెంచినట్లు ఆయన వివరించారు.

వివిధ వర్గాలకు ఇప్పటి వరకు 802 పీవోఎస్‌ (స్వైపింగ్‌) మిషన్లు పంపిణీ చేశామన్నారు. ఎస్‌బీఐ శాఖల్లో కూడా రూ.20 నుంచి రూ.24 వేల వరకు విత్‌డ్రా ఇవ్వడంతో పాటు ఎక్కువ ఏటీఎంలు పనిచేసేలా చర్యలు చేపట్టినట్లు ఎస్‌బీఐ ఆర్‌ఎం ఎంవీఆర్‌ మురళీకృష్ణ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement