ఏలూరు (మెట్రో) : ధాన్యం 75 కేజీల బస్తాకు రూ.1,500 మద్ధతు ధర ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగబోయిన రంగారావు డిమాండ్ చేశారు.
బస్తాకు రూ.1,500 మద్దతు ధర ఇవ్వాలి
Nov 5 2016 12:41 AM | Updated on Sep 4 2017 7:11 PM
ఏలూరు (మెట్రో) : ధాన్యం 75 కేజీల బస్తాకు రూ.1,500 మద్ధతు ధర ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగబోయిన రంగారావు డిమాండ్ చేశారు. ధాన్యం మార్కెట్‌లోకి వచ్చినా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం, అయినకాడికి దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం మద్దతు ధర, స్వామినాథ¯ŒS కమిటీ సిఫార్సుల అమలు అంశంపై స్థానిక ఐఏడీపీ హాలులో శుక్రవారం రాష్ట్ర కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర రైతు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న రంగారావు మాట్లాడుతూ మిల్లర్లు, దళారులు కలిసి తేమశాతం, తాలు శాతం పేరుతో రైతులను నిలువునా దోచుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం రైతుల సమస్యలను గాలికి వదిలేసిందన్నారు. ఈ సదస్సులో రిటైర్డ్ జెడిఎ జి.ప్రసాదరావు, రైతు నాయకులు నల్లిమిల్లి వీరరాఘవరెడ్డి, అట్లూరి రాధాకృష్ణ, జుజ్జవరపు శ్రీనివాస్, పిచ్చెట్టి నరశింహమూర్తి, వాడపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement