మండలంలోని రొయ్యూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఫయాజ్‌ను సస్పెండ్ చేస్తూ డీఎంహెచ్‌ఓ సాంబశివరావు శనివారంఉత్తర్వులుజారీ చేశారు. శుక్రవారం రొయ్యూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రొయ్యూర్ పీహెచ్‌సీ జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్
Sep 11 2016 12:36 AM | Updated on Sep 4 2017 12:58 PM
	ఏటూరునాగారం : మండలంలోని రొయ్యూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఫయాజ్‌ను సస్పెండ్ చేస్తూ  డీఎంహెచ్‌ఓ సాంబశివరావు శనివారంఉత్తర్వులుజారీ చేశారు. శుక్రవారం రొయ్యూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో జూనియర్ అసిస్టెంట్ ఫయాజ్ ఆస్పత్రి గదిలో పడుకొని ఉన్నాడు. పీఓ వెళ్లి ఎం దుకు పడుకున్నావని ప్రశ్నించగా మీరు ఎవరు నన్ను అడుగుతున్నారని అమర్యాదగా ప్రవర్తించాడు. దీంతో పీఓ ఇచ్చిన సిఫారసు మేరకు సస్పెండ్ చేసినట్లు సాంబశివరావు పేర్కొన్నారు.  
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
