రొట్టెల పండగకు ఏర్పాట్లు | Rottela Pandaga from 13th October | Sakshi
Sakshi News home page

రొట్టెల పండగకు ఏర్పాట్లు

Sep 18 2016 10:47 PM | Updated on Mar 21 2019 7:28 PM

రొట్టెల పండగకు ఏర్పాట్లు - Sakshi

రొట్టెల పండగకు ఏర్పాట్లు

నెల్లూరు, సిటీ: వచ్చే నెల 13 నుంచి ప్రారంభం కానున్న రొట్టెల పండగకు ఏర్పాట్లు త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్‌ ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. నగరంలోని బారాషాహిద్‌ దర్గా ప్రాంగణాన్ని ఆదివారం నగర మేయర్‌ అజీజ్, కమిషనర్‌ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్, టూరిజం అధికారులతో కలసి కలెక్టర్‌ సందర్శించారు

 
  •  కలెక్టర్‌ ముత్యాలరాజు
నెల్లూరు, సిటీ: 
వచ్చే నెల 13 నుంచి ప్రారంభం కానున్న రొట్టెల పండగకు ఏర్పాట్లు త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్‌ ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. నగరంలోని బారాషాహిద్‌ దర్గా ప్రాంగణాన్ని ఆదివారం నగర మేయర్‌ అజీజ్, కమిషనర్‌ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్, టూరిజం అధికారులతో కలసి కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. నగర మేయర్‌ అజీజ్‌ మాట్లాడుతూ దర్గా ప్రాంగణంలో నిర్మిస్తున్న 120 శాశ్వత మరుగుదొడ్లను అక్టోబర్‌ 2వ తేదీ నాటికి పూర్తిచేస్తామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం చెరువలో ఘాట్లు నిర్మాణం, లైటింగ్, గార్డెనింగ్‌కు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు టూరిజం వారి సహకారంతో రూ.2.62 కోట్లు మంజూరు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement