రోహిత్‌ కేసులో దోషులను అరెస్ట్‌ చేయాలి | Rohit case, the guilty should be arrested | Sakshi
Sakshi News home page

రోహిత్‌ కేసులో దోషులను అరెస్ట్‌ చేయాలి

Aug 28 2016 8:49 PM | Updated on Sep 4 2018 5:21 PM

సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్‌ ఆనంద్‌తెల్‌తుంబ్డే తదితరులు - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్‌ ఆనంద్‌తెల్‌తుంబ్డే తదితరులు

హిత్‌ వేముల మృతికి కారణమైన దత్తాత్రేయ, స్మృతీఇరానీ, ఎమ్మెల్సీ రాంచంద్రరావు, వీసీ అప్పారావులను అరెస్ట్‌ చేయాలని

సుల్తాన్‌బజార్‌ : హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి రోహిత్‌ వేముల మృతికి కారణమైన కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతీఇరానీ, ఎమ్మెల్సీ రాంచంద్రరావు, వీసీ అప్పారావులను అరెస్ట్‌ చేయాలని, జాతీయ ఎస్సీ కమిషన్‌ ఆదేశాన్ని అమలు చేయాలని డాక్టర్‌ ఆనంద్‌ తెల్‌ తుంబ్డే, ప్రకాష్‌ అంబేద్కర్‌ డిమాండ్‌ చేశారు. రోహిత్‌ వేముల న్యాయపోరాట సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... రోహిత్‌ వేముల మృతి కారణమైన దోషులను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 29 (సోమవారం)న నాంపల్లిలోని గాంధీభవన్‌ ప్రకాశం హాల్‌లో బహిరంగసభను నిర్వహించనున్నట్లు లెలిపారు.

రోహిత్‌ మృతి చెంది 7 నెలలు గడుస్తున్నా ఈ సంఘటనలో  నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన నివేదికతో పాటు జాతీయ ఎస్సీ కమిషన్‌ రోహిత్‌ ఎస్సీఅని డిక్లేర్‌ చేస్తూ సైబరాబాద్‌ పోలీసులకు ఎస్సీ, ఎస్టీ కేసు విచారణ వెంటనే పూర్తి చేసి, రోహిత్‌ వేముల కుటుంబానికి న్యాయం చేయాలని అదేశించి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించి కూడా 4 నెలల గడుస్తోందన్నారు. కార్యక్రమంలోప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణ, బంగారి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement