నల్లగొండ జిల్లా అర్వపల్లి మండలం నర్సింహులపేటలో సోమవారం రాత్రి మూడిళ్లలో దొంగతనం జరిగింది.
అర్వపల్లిలో మూడిళ్లలో చోరీ
Aug 9 2016 11:05 AM | Updated on Aug 30 2018 5:27 PM
అర్వపల్లి: నల్లగొండ జిల్లా అర్వపల్లి మండలం నర్సింహులపేటలో సోమవారం రాత్రి మూడిళ్లలో దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన మెరుగు రాములు, కమ్మాల అయిలయ్య, బుర్ర వీరయ్య ఇళ్లలో గుర్తు తెలియని ముగ్గురు దుండగులు ప్రవేశించి సుమారు నాలుగు తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.30వేల నగదుతో ఉడాయించారు. దొంగల అలికిడికి మేల్కొన్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే స్పందించి గ్రామానికి వస్తుండగా దారిలోనే బైక్‌లపై దొంగలు తారసపడ్డారు. పోలీసులను పసిగట్టిన దొంగలు ఒక పల్సర్ బైక్‌ను అక్కడే వదిలేసి మరో బైక్‌పై పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దొంగలు వదిలి వెళ్లిన బైక్ ఖమ్మం జిల్లా కొత్తగూడెం పట్టణానికి చెందిన జకీర్ పేరిట నమోదై ఉంది. నల్లగొండ నుంచి క్లూస్‌టీంను రప్పించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Advertisement
Advertisement