బ్యాంకులో చోరీకి యత్నం | robbery attempt at telangana grameena bank in karimnagar district | Sakshi
Sakshi News home page

బ్యాంకులో చోరీకి యత్నం

Oct 6 2015 9:59 AM | Updated on Aug 30 2018 5:24 PM

కరీంనగర్ జిల్లా సారంగపూర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో సోమవారం అర్ధరాత్రి చోరీకి యత్నం జరిగింది.

సారంగపూర్ : కరీంనగర్ జిల్లా సారంగపూర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో సోమవారం అర్ధరాత్రి చోరీకి యత్నం జరిగింది. దొంగలు బ్యాంకు తలుపులు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. గొడ్డళ్లతో లాకర్లను పగలగొట్టడానికి ప్రయత్నించినప్పటికీ అవి తెరుచుకోక పోవడంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు.

బ్యాంకు తలుపులు పగలగొట్టి ఉండటం మంగళవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. దుండగులు బ్యాంకులో ఏమైనా వస్తువులు, డబ్బు చోరీ చేశారా అనేది అధికారులు ఇంకా నిర్ధారించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement