సీతమ్మధారలోని నార్త్ ఎక్స్‌టెన్స¯Œæలోని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఇంట్లో సోమవారం అర్ధరాత్రి భారీ దొంగతనం జరిగింది. 168 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి.
ఎస్‌ఈ ఇంట్లో భారీ చోరీ
Aug 10 2016 12:57 AM | Updated on Sep 15 2018 8:15 PM
సీతమ్మధార: సీతమ్మధారలోని నార్త్ ఎక్స్‌టెన్స¯Œæలోని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఇంట్లో సోమవారం అర్ధరాత్రి భారీ దొంగతనం జరిగింది. 168 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రూరల్ డెవలప్‌మెంట్ వాటర్ వర్క్స్ డిపార్టుమెంట్ (ఆర్‌డబ్ల్యూఎస్)లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ప్రభాకర్ కుటుంబ సభ్యులతో సీతమ్మధారలోని నార్త్ ఎక్స్‌నెన్స¯Œæలో నివాసం ఉంటున్నారు. విధుల్లో భాగంగా సోమవారం రాత్రి ఎస్‌ఈ అరకు వెళ్లడంతో అతని భార్య ఆదిలక్ష్మి, కుమార్తె ఇంటిలో నిద్రపోయారు. అర్ధరాత్రి సమయంలో దొంగలు కిటికీ నుంచి కర్రతో తలుపు గెడ తీసి లోపలకు ప్రవేశించి బీరువాలోని బంగారు ఆభరణాలు దోచుకుపోయారు. తెల్లవారి జామున కుటుంబ సభ్యులు నిద్రలేచి చూసేసరికి తలుపు తీసి ఉండడంతో దొంగతనం జరిగిందని గుర్తించి ప్రభాకర్ భార్య ఆదిలక్ష్మి ఫోర్త్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 168 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈస్ట్ ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి, క్రైం ఎస్‌ఐ నారాయణరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. డాగ్ స్కాడ్‌తో పాటు క్లూస్ టీం సీఐ రామచంద్రరావు సిబ్బందితో తనిఖీలు చేశారు. ఫోర్తుటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement