కృష్ణా పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు పొటెత్తుతుండటంతో..సందట్లో సడేమియాలాగా జేబు దొంగలు తమ పని చక్కబెడుతున్నారు.
సందట్లో సడేమియాలు
Aug 13 2016 4:27 PM | Updated on Aug 30 2018 5:27 PM
	విజయవాడ: కృష్ణా పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు పొటెత్తుతుండటంతో.. సందట్లో సడేమియాలాగా జేబు దొంగలు తమ పని  చక్కబెడుతున్నారు. పద్మావతి ఘాట్‌లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని భక్తులు ఘాట్‌కు వచ్చిన డీజీపీ, ఎమ్మెల్యే గద్దెలకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పిక్ పాకెటర్లపై దృష్టి సారించి 10 మంది చోర శిఖామణులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారంతా 14 ఏళ్లలోపు వారు కావడంతో.. పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. వాళ్ల ఫోటోలు తీసుకొని పుష్కరాలు జరిగే రోజుల్లో ఆ పరిసర ప్రాంతాల్లో కనిపించొద్దని హెచ్చరించి వదిలేశారు. 
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
