అంతర్‌ జిల్లా దొంగ అరెస్ట్‌ | robber arrest | Sakshi
Sakshi News home page

అంతర్‌ జిల్లా దొంగ అరెస్ట్‌

Sep 4 2016 7:51 PM | Updated on Aug 30 2018 5:27 PM

మెట్‌పల్లి : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడిన షేక్‌Sఉస్మాన్‌(45)ను మెట్‌పల్లి పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. సీఐ సురేందర్‌ పోలీస్‌ స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. పట్టణంలోని బీడీ కాలనీకి చెందిన ఉస్మాన్‌ మెట్‌పల్లితోపాటు హైదరాబాద్, వరంగల్‌ తదితర ప్రాంతాల్లో దొంగతనాలు చేశాడు.

మెట్‌పల్లి : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడిన షేక్‌Sఉస్మాన్‌(45)ను మెట్‌పల్లి పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. సీఐ సురేందర్‌ పోలీస్‌ స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. పట్టణంలోని బీడీ కాలనీకి చెందిన ఉస్మాన్‌ మెట్‌పల్లితోపాటు హైదరాబాద్, వరంగల్‌ తదితర ప్రాంతాల్లో దొంగతనాలు చేశాడు. గత మార్చిలో స్థానిక చైతన్యనగర్‌లోని ఓ ఇంట్లో చొరబడి బంగారం ఎత్తుకెళ్లాడు. ఈ నేపథ్యంలోనే అతడిపై ఏడు అరెస్ట్‌ వారెంట్లు జారీ అయ్యాయి. అప్పటి నుంచి పరారీలో ఉన్న ఉస్మాన్‌ను స్థానిక బస్‌స్టేషన్‌ వద్ద పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి రెండు తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. సమావేశంలో ఎస్సై అశోక్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement