కారు–బైక్‌ ఢీ: ఒకరికి తీవ్రగాయాలు | road accident.. seriously injuried | Sakshi
Sakshi News home page

కారు–బైక్‌ ఢీ: ఒకరికి తీవ్రగాయాలు

Jul 19 2016 9:57 PM | Updated on Aug 30 2018 4:07 PM

రాజీవ్‌ రహదారిపై కారు, బైక్‌ ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన కొండపాక చౌరస్తా వద్ద మంగళవారం చోటుచేసుకుంది.

కొండపాక: రాజీవ్‌ రహదారిపై కారు, బైక్‌ ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన కొండపాక చౌరస్తా వద్ద మంగళవారం చోటుచేసుకుంది. కుకునూరుపల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి కథనం ప్రకారం... తిమ్మారెడ్డిపల్లికి చెందిన ఎల్లు నర్సింహారెడ్డి దుద్దెడ నుంచి కొండపాకకు వెళ్లేందుకు రాజీవ్‌ రహదారిపై ఉన్న కొండపాక క్రాస్‌ రోడ్డు వద్ద మలుపు వద్ద ఉన్నాడు. హైదరాబాద్‌ నుంచి సిద్దిపేట వైపు వేగంగా వెళ్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో బైక్‌పై ఉన్న నర్సింహారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం నర్సింహారెడ్డి హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐతెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement