గొల్లపల్లి మండలంలోని ఆత్మకూర్ గ్రామానికి చెందిన కోమటñ ట్టి లచ్చయ్య(40) సౌదీలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వ్యవసాయభూమి లేకపోవడం.. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగానే నాలుగేళ్ల క్రితం సౌదీవెళ్లాడు.
సౌదీలో ఆత్మకూర్ వాసి దుర్మరణం
Aug 31 2016 9:27 PM | Updated on Aug 30 2018 4:07 PM
గొల్లపల్లి: మండలంలోని ఆత్మకూర్ గ్రామానికి చెందిన కోమటñ ట్టి లచ్చయ్య(40) సౌదీలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వ్యవసాయభూమి లేకపోవడం.. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగానే నాలుగేళ్ల క్రితం సౌదీవెళ్లాడు. అక్కడ బల్దియా పనుల్లో భాగంగా రోడ్డుపై పనిచేస్తుండగా.. వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతదేహం నుజ్జునుజ్జుయింది. అక్కడి స్నేహితులు సర్పంచ్ పాదం రజిత భర్త రమేశ్‌కు సమాచారం అందించారు. లచ్చయ్యకు భార్య జమున, కొడుకు, కూతురు ఉన్నారు.
Advertisement


