రిషితేశ్వరి రెండో డైరీపై ఫోరెన్సిక్ నివేదిక | Rishiteswari suicide second diary report sent to guntur sp | Sakshi
Sakshi News home page

రిషితేశ్వరి రెండో డైరీపై ఫోరెన్సిక్ నివేదిక

Sep 5 2015 1:29 PM | Updated on Oct 4 2018 5:51 PM

రిషితేశ్వరి రెండో డైరీపై ఫోరెన్సిక్ నివేదిక - Sakshi

రిషితేశ్వరి రెండో డైరీపై ఫోరెన్సిక్ నివేదిక

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో రెండో డైరీపై ఫోరెన్సిక్ నివేదిక వెల్లడైంది.

గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో రెండో డైరీపై ఫోరెన్సిక్ నివేదిక వెల్లడైంది. సూసైడ్ నోట్ తో పాటు, రెండో డైరీలోని చేతిరాత రిషితేశ్వరిదేనని నివేదికలో తేలింది. మొత్తం రెండు డైరీలతో పాటు రిషితేశ్వరికి చెందిన మరో నాలుగు నోట్ బుక్స్ను ఫోరెన్సిక్ అధికారులు పరీక్షించారు.

 

ఒక లాంగ్ నోట్ బుక్, మరొక స్పైరల్ బుక్, మరో రెండు ఆన్సర్ నోట్ బుక్లలోని రిషితేశ్వరి చేతిరాతను ఫోరెన్సిక్ అధికారులు పోల్చి చూశారు.   ఈ నివేదికను ఫోరెన్సిక్ అధికారులు శనివారం గుంటూరు జిల్లా ఎస్పీకి అందచేశారు.  ఈ కేసులో మరికొందరి పేర్లను చేర్చే అవకాశం ఉంది. ఛార్జ్షీట్ వేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.  కాగా ర్యాగింగ్ కారణంగా మనస్తాపం చెందిన రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement