దుండగుల దాడిలో మహారాష్ట్ర వాసి మృతి | resident of Maharastra state dies after seviour injuries caused by goons | Sakshi
Sakshi News home page

దుండగుల దాడిలో మహారాష్ట్ర వాసి మృతి

Jul 16 2016 8:15 PM | Updated on Oct 9 2018 5:39 PM

నిజామాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సారంగపూర్, నెహ్రూనగర్ ప్రాంతంలో గురువారం గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో దెబ్బలు తిని గాయాలకు గురై ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని మహారాష్ట్ర వాసిగా శుక్రవారం గుర్తించారు.

నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సారంగపూర్, నెహ్రూనగర్ ప్రాంతంలో గురువారం గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో దెబ్బలు తిని గాయాలకు గురై ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని మహారాష్ట్ర వాసిగా శుక్రవారం గుర్తించారు. మృతుడు పర్బణీకి చెందిన ఠాకూర్ సూరజ్(30) సెక్యూరిటీ గార్డు పనిచేసేవాడని గుర్తించినట్లు ఎస్‌హెచ్‌వో వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పర్బణి నుంచి నెహ్రూనగర్‌లోని బంధువుల ఇంటికి వచ్చాడని పేర్కొన్నారు. అతను మరణించినట్లు పత్రికల్లో వచ్చిన వార్తను చూసి కుటుంబసభ్యులు బంధువులు పోలీసు స్టేషన్‌కు వచ్చి మృతదేహాన్ని చూసి గుర్తించారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో వెంకటేశ్వర్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement