విభజనపై నివేదికలు ఇవ్వాలి | Reports on the partition should be given | Sakshi
Sakshi News home page

విభజనపై నివేదికలు ఇవ్వాలి

Sep 1 2016 12:57 AM | Updated on Sep 15 2018 2:27 PM

కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాలకు సంబంధించి ఉద్యోగుల పంపిణీ, కార్యాలయాల గుర్తింపు, పని తక్కువగా ఉన్న, ఒకే విధమైన శాఖల విలీనంపై జిల్లా అధికారులు సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ వాకాటి కరుణ ఆదేశించారు. హన్మకొండలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బుధవారం జిల్లాల విభజనపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌ సమావేశమయ్యారు.

  • సర్దుబాటు విషయంలో సహకరించాలి
  • కలెక్టర్‌ వాకాటి కరుణ
  • హన్మకొండ అర్బన్‌ : కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాలకు సంబంధించి ఉద్యోగుల పంపిణీ, కార్యాలయాల గుర్తింపు, పని తక్కువగా ఉన్న, ఒకే విధమైన శాఖల విలీనంపై జిల్లా అధికారులు సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ వాకాటి కరుణ ఆదేశించారు. హన్మకొండలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బుధవారం జిల్లాల విభజనపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌ సమావేశమయ్యారు. ఈlసందర్భంగా ఆమె మా ట్లాడుతూ రాష్ట్ర ప్రగతి, ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా ప్రభుత్వ శాఖల విభజన చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగుల అవసరం ఎక్కువగా ఉంటుందనే విషయంపై పూర్తిస్థాయిలో ఆలోచించి నివేదిక ఇవ్వాలన్నారు. విభజనలో ఉద్యోగుల సీనియారిటీ, ఉద్యోగాలు నష్టపోవడం ఉండదన్నారు. ఉద్యోగాల సర్దుబాటు విషయంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రతి శాఖలో ఒక ఉన్నతాధికారి, ఒక మండలాధికారి ఉండే విధంగా నివేదికను రూపొందించాలన్నారు. ప్రతి శాఖలోని మొత్తం ఫైళ్లను జాబితాగా రూపొందించి వాటిని స్కా న్, జిరాక్స్‌ చేసి కొత్త జిల్లాలకు ఇవ్వాలన్నారు. మౌలిక సదుపాయాలు, వాహనాల ఇబ్బంది లేకుండా జిల్లాలకు కేటాయించాలని సూచించారు. కొత్తగా ఏర్పడే జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలు గుర్తించాలని.. ఈ విషయంలో సంబంధిత రెవెన్యూ అధికారిని సంప్రదిం చాలని సూచించారు. కొత్త జిల్లాల్లో కార్యాలయాల ఏర్పాటు విషయంలో పూర్తి బాధ్యతలు ఆయా శాఖల అధికారులపైనే ఉందన్నారు. సమా వేశంలో జేసీ ప్రశాంత్‌జీవన్‌పాటిల్, డీఆర్వో శోభ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement