మండలంలోని చెల్పూరు శివారులో ఉన్న కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 600 మెగావాట్ల ప్లాంట్‌కు మరమ్మతులు కొనసాగుతున్నాయి. బీహెచ్‌ఈఎల్‌కు చెందిన ఆరుగురు ఇంజినీర్ల బృందం జనరేటర్‌కు మరమ్మతులు చేపట్టింది. జనరేటర్‌లో విద్యుదుత్పత్తి చేసే కోర్స్ విభాగంలో సాంకేతిక లోపం తలెత్తడంతో దాన్ని రెండు భాగాలుగా విభజించారు.
600 మెగావాట్ల ప్లాంట్‌కు కొనసాగుతున్న మరమ్మతులు
Sep 19 2016 12:30 AM | Updated on Sep 4 2017 2:01 PM
గణపురం : మండలంలోని చెల్పూరు శివారులో ఉన్న కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 600 మెగావాట్ల ప్లాంట్‌కు మరమ్మతులు కొనసాగుతున్నాయి. బీహెచ్‌ఈఎల్‌కు చెందిన ఆరుగురు ఇంజినీర్ల బృందం జనరేటర్‌కు మరమ్మతులు చేపట్టింది. జనరేటర్‌లో విద్యుదుత్పత్తి చేసే కోర్స్ విభాగంలో సాంకేతిక లోపం తలెత్తడంతో దాన్ని రెండు భాగాలుగా విభజించారు. గత 25 రోజులుగా మరమ్మతులు కొనసాగుతున్నాయి. రిపేరింగ్ పూర్తికావడానికి మరో పది రోజులు పట్టొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, డైరెక్టర్లు సచ్చిదానందం, రాధాకృష్ణ మరమ్మతులు జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. కేటీపీపీ సీఈ శివకుమార్ మాట్లాడుతూ.. ‘ కొత్తప్లాంట్‌కు మరమ్మతులు చేపట్టాం. వారం రోజుల్లో పనులు పూర్తి కావచ్చు’ అని తెలిపారు.
Advertisement


