ఫ్లెక్సీలు, పోస్టర్లు తొలగించండి | remove the flex and posters | Sakshi
Sakshi News home page

ఫ్లెక్సీలు, పోస్టర్లు తొలగించండి

Feb 11 2017 10:29 PM | Updated on Oct 2 2018 7:28 PM

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, పోస్టర్లను తొలగించాలని అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం ఆదేశించారు.

అనంతపురం అర్బన్‌ : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, పోస్టర్లను తొలగించాలని  అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం ఆదేశించారు. శనివారం మునిసిపల్‌ కమిషనర్లు, తహశీల్దార్లతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నగరాలు, పట్టణాలు, మండలాలు, గ్రామాల్లో ఎక్కడా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఉండరాదన్నారు. సోమ, మంగళవారాల్లో మునిసిపాలిటీల్లో పర్యటించి, తనిఖీ చేస్తామన్నారు. ఎక్కడైనా ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగితే కఠిన చర్యలు ఉంటాయని జేసీ హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement