షోరూంలలోనే వాహనాల రిజిస్ట్రేషన్లు | registrations at showroom | Sakshi
Sakshi News home page

షోరూంలలోనే వాహనాల రిజిస్ట్రేషన్లు

Aug 5 2016 10:38 PM | Updated on Sep 4 2017 7:59 AM

షోరూంలలోనే వాహనాల రిజిస్ట్రేషన్లు

షోరూంలలోనే వాహనాల రిజిస్ట్రేషన్లు

జిల్లాలో వాహనాల రిజిస్ట్రేషన్లు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు ఆర్టీవో పురేంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 26వ తేదీ నుంచి జిల్లాలో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

విజయవాడ : 
జిల్లాలో వాహనాల రిజిస్ట్రేషన్లు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు ఆర్టీవో పురేంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 26వ తేదీ నుంచి జిల్లాలో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని పేర్కొన్నారు. వాహనాలు కొనుగోలు చేసే వారు షోరూంలలో స్లాట్‌ బుకింగ్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నిర్వహించుకోవాలని సూచించారు. అన్ని కాగితాలు సక్రమంగా ఇస్తే ఒక్క రోజులో రిజిస్ట్రేషన్‌ చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు 974 వాహనాలు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోగా 200 దరఖాస్తులు తిరస్కరించామని పేర్కొన్నారు. తిరస్కరించిన దరఖాస్తుదారులు ఆధార్‌ నంబర్లు ఇవ్వలేదన్నారు. ఆధార్‌ నంబరు, హెల్మెట్‌ కొనుగోలు చేసిన బిల్లులు రిజిస్ట్రేషన్‌ దరఖాస్తులో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. ఇంటివద్దకే ఆర్‌సీ బుక్‌ను పోస్టులో పంపుతామని వివరించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement