ఎర్ర చందనం దుంగల స్వాధీనం | Red Sandle Staves Seized | Sakshi
Sakshi News home page

ఎర్ర చందనం దుంగల స్వాధీనం

Oct 21 2016 10:31 PM | Updated on Sep 4 2017 5:54 PM

ఎర్ర చందనం దుంగల స్వాధీనం

ఎర్ర చందనం దుంగల స్వాధీనం

మండలంలోని బి యర్రగుడి గ్రామం చెంచెర్లపల్లె సమీపంలోని సన్నాకుల మర్రి చెట్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న 4 ఎర్రచందనం దుంగలను ఫారెస్ట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

లక్కిరెడ్డిపల్లె: మండలంలోని బి యర్రగుడి గ్రామం చెంచెర్లపల్లె సమీపంలోని సన్నాకుల మర్రి చెట్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న 4 ఎర్రచందనం దుంగలను ఫారెస్ట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాయచోటి రేంజ్‌ అధికారి జీజే ప్రసాద్‌రావ్‌ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మల్లినాయుడు, భాస్కర్‌ అనే ఇద్దరు వ్యక్తులు గురువారం రాత్రి ద్విచక్ర వాహనంలో పెద్ద బ్యాగుతో వెళ్తుండగా అధికారులకు అనుమానం వచ్చి.. వారిని వెంబడించి పట్టుకొని తనిఖీ చేశారు. అందులోని 4 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని వారిని అరెస్ట్‌ చేశారు. వారి వద్ద వున్న ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేరంతో సంబంధం ఉన్న చెంచెర్లపల్లెకు చెందిన సదాశివనాయుడు అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. దాడుల్లో ఫారెస్ట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement