ఐదుగురు స్మగ్లర్ల అరెస్టు | Five smugglers arrested | Sakshi
Sakshi News home page

ఐదుగురు స్మగ్లర్ల అరెస్టు

Aug 4 2016 12:19 AM | Updated on Sep 4 2017 7:40 AM

సిద్దవటం మండలం కనుమలోపల్లె వద్ద గతంలో జరిగిన ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో బుధవారం పీటీ వారెంటుపై ఐదుగురిని అరెస్టు చేశామని ఎస్‌ఐ లింగప్ప తెలిపారు.

సిద్దవటం :

సిద్దవటం మండలం కనుమలోపల్లె వద్ద గతంలో జరిగిన ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో బుధవారం పీటీ వారెంటుపై ఐదుగురిని అరెస్టు చేశామని ఎస్‌ఐ లింగప్ప తెలిపారు. జూన్‌లో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ కనుమలోపల్లె వద్ద ఇద్దరు తమిళ కూలీలు పట్టుబడిన విషయం తెలిసిందేనన్నారు. ఈ మేరకు వారిని విచారించగా చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీనివాసులురెడ్డి, నెల్లూరుకు చెందిన సుదర్శన్, కడప జిల్లా బద్వేలుకు చెందిన సుబ్బారెడ్డి, రాయచోటికి చెందిన దర్బార్‌బాషా, కడపకు చెందిన చంద్రశేఖర్‌ హస్తమున్నట్లు విచారణలో తేలిందన్నారు. గతంలో ఎర్రచందనం కేసుల్లో  కడప కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వీరిని పీటీ వారెంటుపై బుధవారం అరెస్టు చేసి సిద్దవటం కోర్టులో హాజరుపరిచామని ఎస్‌ఐ తెలిపారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement