ఏడుగురు ఎర్ర స్మగ్లర్ల అరెస్ట్‌ | Seven red smugglers arrested | Sakshi
Sakshi News home page

ఏడుగురు ఎర్ర స్మగ్లర్ల అరెస్ట్‌

Oct 28 2016 1:00 AM | Updated on Sep 4 2017 6:29 PM

ఏడుగురు ఎర్ర స్మగ్లర్ల అరెస్ట్‌

ఏడుగురు ఎర్ర స్మగ్లర్ల అరెస్ట్‌

మండల పరిధిలోని కృష్ణంపల్లె వద్ద గురువారం ఉదయం ఎర్రచందనం తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఏడు దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు మైదుకూరు రూరల్‌ సీఐ నాగభూషణం తెలిపారు.

- ఏడు దుంగలు స్వాధీనం
దువ్వూరు(చాపాడు):  మండల పరిధిలోని కృష్ణంపల్లె వద్ద గురువారం ఉదయం ఎర్రచందనం తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఏడు దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు మైదుకూరు రూరల్‌ సీఐ నాగభూషణం తెలిపారు. నంద్యాల, మైదుకూరు,చెన్నై ప్రాంతాలకు చెందిన స్మగ్లర్లు అడవుల్లో ఎర్రచందనం దుంగలను నరికి కృష్ణంపల్లె వద్ద గల నారాయణస్వామి గుడి వద్ద సిద్ధంగా ఉండగా, ముందస్తు సమాచారంతో పోలీసులు దాడి చేశారన్నారు. పట్టుబడిన వారిలో దువ్వూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన వినోద్, చింతకుంటకు చెందిన జిలానీబాషా, రాజుపాళెం మండలం కూలూరు కొట్టాలకు చెందిన ప్రభాకర్, బీమఠం మండలం రేకలకుంటకు చెందిన నారాయణ, సోమయాజులపల్లెకు చెందిన శీర్ల సిద్దయ్య, గోపవరం మండలం లెక్కలవారిపల్లెకు చెందిన కొప్పల శ్రీరాములతో పాటు దువ్వూరు ఎస్సీ కాలనీకి చెందిన మరో వ్యక్తి ఉన్నారన్నారు. వీరిందరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement