తమిళ కూలీల అరెస్టు | Tamil laborers arrested | Sakshi
Sakshi News home page

తమిళ కూలీల అరెస్టు

Aug 1 2016 11:20 PM | Updated on Aug 20 2018 4:44 PM

తమిళ కూలీల అరెస్టు - Sakshi

తమిళ కూలీల అరెస్టు

ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు తమిళ కూలీలను పోలీసులు పట్టుకున్నారు. నాగసానిపల్లెకు వెళ్లే రహదారిలో ఉన్న చిలకకనం వద్ద ఎర్రచందనం తరలిస్తున్నట్లు ఖాజీపేట ఎస్‌ఐ రాజగోపాల్‌కు సమాచారం రావడంతో దాడులు నిర్వహించారు.

ఖాజీపేట :

ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు తమిళ కూలీలను పోలీసులు పట్టుకున్నారు. నాగసానిపల్లెకు వెళ్లే రహదారిలో ఉన్న చిలకకనం వద్ద ఎర్రచందనం తరలిస్తున్నట్లు ఖాజీపేట ఎస్‌ఐ రాజగోపాల్‌కు సమాచారం రావడంతో.. ఆయన తన సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 3 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే తమిళనాడులోని సెంతిల్‌ తిరచునూరుకు చెందిన సెంతిల్, పోలూరుకు చెందిన దేవేంద్రన్‌ను అదుపులోకి తీసుకున్నారు. సెంతిల్‌ బీఈడీ చదువుకున్నాడు. నిరుపేద. దండిగా డబ్బు వస్తుందని అతనికి ఆశ చూపి తీసుకువచ్చినట్లు తెలిసింది. చివరకు ఇలా పోలీసులకు బుక్కయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement