ఆటోలో అత్యాచారయత్నం | rape attempt in running auto in nellore district | Sakshi
Sakshi News home page

ఆటోలో అత్యాచారయత్నం

Dec 5 2015 8:43 PM | Updated on Jul 28 2018 8:53 PM

కీచకుల బారి నుంచి తప్పించుకునేందుకు ఓ మహిళ ఆటోనుంచి కిందకు దూకడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి.

ఆత్మకూరు: కీచకుల బారి నుంచి తప్పించుకునేందుకు ఓ మహిళ ఆటోనుంచి కిందకు దూకడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు వద్ద శనివారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆటోలో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళపై డ్రైవర్‌తోపాటు, మరో వ్యక్తి అత్యాచారం చేయబోయాడు. భయంతో ఆమె కిందకు దూకేసింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆటోను అడ్డగించి డ్రైవర్‌కు దేహశుద్ధి చేశారు. గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement