నీకు నేను.. నాకు నువ్వు | Rambhadrapuram, దివ్యాంగ సోదరులు | Sakshi
Sakshi News home page

నీకు నేను.. నాకు నువ్వు

Aug 1 2016 11:57 PM | Updated on Sep 4 2017 7:22 AM

నీకు నేను.. నాకు నువ్వు

నీకు నేను.. నాకు నువ్వు

కాలికి దెబ్బ తగిలిలే కకావికలమైపోయే వాళ్లు కొందరు. కాళ్లు పనిచేయకపోయినా.. కళ్లు కనిపించకపోయినా.. హాయిగా సాగిపోయే వాళ్లు మరికొందరు. రెండోకోవకు చెందుతారు రామభద్రపురానికి చెందిన ఇద్దరు దివ్యాంగ సోదరులు. ఒకరు పుట్టుకతోనే అంధుడు. మరొకరు పుట్టుకతోనే కాళ్లు కదపలేడు.

దివ్యాంగులైన తోబుట్టువుల అనుబంధం
 
రామభద్రపురం: కాలికి దెబ్బ తగిలిలే కకావికలమైపోయే వాళ్లు కొందరు. కాళ్లు పనిచేయకపోయినా.. కళ్లు కనిపించకపోయినా.. హాయిగా సాగిపోయే వాళ్లు మరికొందరు. రెండోకోవకు చెందుతారు రామభద్రపురానికి చెందిన ఇద్దరు దివ్యాంగ సోదరులు. ఒకరు పుట్టుకతోనే అంధుడు. మరొకరు పుట్టుకతోనే కాళ్లు కదపలేడు. అదే వీరి బంధాన్ని మరింత దగ్గర చేసింది. ఒకరికొకరు తోడుంటారు. జీవనయానాన్ని సాఫీగా సాగిస్తున్నారు. పూడివీధికి చెందిన పూడి సూర్యనారాయణ కాళ్లు చచ్చుబడిపోవడంతో నడవలేడు. దీంతో ఒకబండిలో అతన్ని కూర్చోబెట్టి అంధుడైన తమ్ముడు చిన్నంనాయుడు తోస్తుంటాడు. ఎటు వెళ్లాలో అన్న చెబుతుంటే.. తమ్ముడు బండి తోస్తూ సాగిపోయే దశ్యం స్థానికులకు చిరపరిచితం. కొద్దిపాటి వ్యవసాయం, ఆవు, దివ్యాంగ పింఛనుతో సంతప్తికరంగా బతుకుతున్న వీళ్ల జీవితం ఎందరికో ఆదర్శనీయం. చిన్నంనాయుడికి వివాహం కాగా సూర్యనారాయణకు అవివాహితుడు. 
 

Advertisement
 
Advertisement
Advertisement