పూజలు నిర్వహిస్తున్న ప్రధానార్చకులు, ఉట్టి కొట్టేందుకు యత్నిస్తున్న భక్తులు
భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో శనివారం ఉట్ల పండగ ఘనంగా జరిగింది. శ్రీకృష్ణ జన్మాష్టమి మరుసటి రోజున రామాలయంలో ఈ పండగను నిర్వహిస్తున్నారు.
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో శనివారం ఉట్ల పండగ ఘనంగా జరిగింది. శ్రీకృష్ణ జన్మాష్టమి మరుసటి రోజున రామాలయంలో ఈ పండగను నిర్వహిస్తున్నారు. రామయ్య ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చి ఉట్లు కొట్టే చోట ఉంచారు. ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపం ముందు ఉట్ల కొట్టే వేడుక కన్నులపండువగా సాగింది. అనంతరం, స్వామి వారు తిరువీ«ధి సేవకు బయలుదేరారు. వైకుంఠరాముడు తమ ఇంటి ముందుకు రావడంతో భక్తులు మొక్కులు తీర్చుకుంటూ నీరాజనాలు పలికారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఓ రమేష్‌బాబు, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, పర్యవేక్షకుడు నర్సింహరాజు, పీఆర్‌ఓ సాయిబాబు, అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


