ఆ నలుగురి ఎన్నిక ఏకగ్రీవం | rajya sabha elections naminations | Sakshi
Sakshi News home page

ఆ నలుగురి ఎన్నిక ఏకగ్రీవం

Jun 2 2016 7:19 PM | Updated on Sep 4 2017 1:30 AM

ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు రాజ్యసభ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు రాజ్యసభ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున డమ్మీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన సునందారెడ్డి తన నామినేషన్ పత్రాలను ఉపసంహరించటంతో నలుగురి ఎన్నిక ఏకగ్రీవమైంది. తన నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకుంటున్నట్లు సునందారెడ్డి బుధవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె. సత్యనారాయణకు లేఖ అందజేశారు. దీంతో రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన వి. విజయసాయిరెడ్డి (వైఎస్సార్‌సీపీ), కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు (బీజేపీ), కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి, మాజీ మంత్రి టీజీ వెంకటేష్ (టీడీపీ)లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే.  వీరి ఎన్నికను శుక్రవారం సాయంత్రం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించి ధ్రువ పత్రాలను అందజేస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement