రాగల నాలుగు రోజుల్లో జిల్లాలో ఓ మాదిరి వర్షం కురిసే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు తెలిపారు.
అనంతపురం అగ్రికల్చర్: రాగల నాలుగు రోజుల్లో జిల్లాలో ఓ మాదిరి వర్షం కురిసే సూచనలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు తెలిపారు. బుధవారం నుంచి శనివారం వరకు 5 నుంచి 25 మి.మీ మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు.
పగటి ఉష్ణోగ్రతలు 34 నుంచి 36, రాత్రిళ్లు 22 నుంచి 23 డిగ్రీలు నమోదవుతాయని తెలిపారు. గంటకు 18 నుంచి 23 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుందని తెలిపారు.