కొనసాగుతున్న వర్షాలు | rain continues | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న వర్షాలు

Sep 28 2016 10:38 PM | Updated on Sep 4 2017 3:24 PM

జిల్లాలో మంగళవారం రాత్రి 16 మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది.

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాలో మంగళవారం రాత్రి 16 మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా మంత్రాలయంలో 31.4 మి.మీ., వర్షపాతం నమోదయింది. ఆలూరులో 30.6 మి.మీ., ఆళ్లగడ్డలో 18.4, గోస్పాడులో 18.2, పెద్దకడుబూరులో 16, ప్యాపిలిలో 15.4, తుగ్గలిలో 10, మద్దికెరలో 10 మి.మీ., ప్రకారం వర్షం కురిసింది. సెప్టెంబర్‌ నెల సాధారణ వర్షపాతం 125.7 మి.మీ., ఉండగా ఇప్పటి వరకు 151.6 మి.మీ., వర్షాలు కురిశాయి. అంటే 21 శాతం అధికంగా వర్షం కురిసింది. 14 మండలాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం కంటే అధికంగా వర్షపాతం నమోదయింది.
 

Advertisement
 
Advertisement
Advertisement