రాయికల్‌ను జగిత్యాల రెవెన్యూ డివిజన్‌లో ఉంచాలి | raikal stay in jagityala divizon | Sakshi
Sakshi News home page

రాయికల్‌ను జగిత్యాల రెవెన్యూ డివిజన్‌లో ఉంచాలి

Aug 20 2016 5:59 PM | Updated on Sep 4 2017 10:06 AM

రాయికల్‌ : రాయికల్‌ మండలాన్ని జగిత్యాల రెవెన్యూ డివిజన్‌లోనే కొనసాగించాలని కోరుతూ మండల బీజేపీ ఆధ్వర్యంలో శనివారం తహసీల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

రాయికల్‌ : రాయికల్‌ మండలాన్ని జగిత్యాల రెవెన్యూ డివిజన్‌లోనే కొనసాగించాలని కోరుతూ మండల బీజేపీ ఆధ్వర్యంలో శనివారం తహసీల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు తురగ శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ, దశాబ్ద కాలంగా రాయికల్‌ జగిత్యాల రెవెన్యూ డివిజన్‌లో ఉందని మండలంలోని ప్రజలకు వర్తక, వ్యాపారపరంగా జగిత్యాలతో సంబంధాలున్నాయని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయం తీసుకోకుండా రాయికల్‌ మండలాన్ని కోరుట్ల రెవెన్యూలో కలపడం సరికాదన్నారు. తహసీల్దార్‌ చంద్రప్రకాశ్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గాజంగి అశోక్, వెంకటేశ్వర్‌రెడ్డి, వేణు, రాంచంద్రం, ధర్మపురి, రమేశ్, నరేశ్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement