టీడీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం | Rachakandriga villagers slams TDP mla adithya | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం

Aug 15 2016 11:16 AM | Updated on Sep 4 2017 9:24 AM

ఎన్నికల తర్వాత ఇప్పుడు గుర్తొచ్చామాంటూ ఎమ్మెల్యేపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిత్తూరు: వరదాయపాల్యం మండలంలో టీడీపీ ఎమ్మెల్యే ఆదిత్యకు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే కాన్వాయ్‌ను రాచకండ్రిగ గ్రామస్తులు సోమవారం అడ్డుకున్నారు. తమ వాడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పట్టించుకోలేదంటూ ఎన్నికల తర్వాత ఇప్పుడు గుర్తొచ్చామాంటూ ఎమ్మెల్యే ఆదిత్యపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికే వరదాయపాల్యంలో సీజనల్‌ వ్యాధులు విజృభించడంతో నిన్న డెంగ్యూ వ్యాధితో తొమ్మిదేళ్ల బాలిక మృతిచెందింది. ఎన్నికలు జరిగిన చాలాకాలం తర్వాత ఎమ్మెల్యే వారి గ్రామానికి రావడంతో గ్రామస్తులు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకుని ఆందోళన వ్యక్తం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement