పుష్కరాల విజయవంతానికి కృషి | Sakshi
Sakshi News home page

పుష్కరాల విజయవంతానికి కృషి

Published Wed, Jul 20 2016 12:53 AM

Pushkarni effort succesfully

దామరచర్ల : పుష్కరాల విజయ వంతానికి కృషి చేస్తామని వాడపల్లి శివాలయం ప్రధాన ఘాట్‌ ప్రత్యేక అధికారి ,జిల్లా స్టెప్‌ అధికారి కె.వేణుగోపాల్‌రావు తెలిపారు. మంగళవారం శ్రీమీనాక్షి అగస్తే్యశ్వర స్వామి దేవాలయంలో అధికారులు,దేవాలయ చైర్మన్‌తో కలిసి సమీక్ష జరిపారు.

జిల్లాలో అత్యధికంగా ఈఘాట్‌కే పుష్కర భక్తులు వచ్చే వీలున్నందున దీనిపై ప్రత్యేక శ్రద్ధచూపుతామన్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.సమావేశంలో దేవాలయ చైర్మన్‌ కొందూటి సిద్దయ్య,ఆర్‌డబ్ల్యూయస్‌ డీఈ బ్రహ్మంబాబు,ఏఈలు సంపత్‌ కుమార్, రవికిర ణ్‌లు పాల్గొన్నారు. వాడపల్లి అయ్యప్ప ఘాట్‌ ప్రత్యేక అధికారి జిల్లా డీటీడబ్లు్యఓ నర్వోత్తమ్‌ రెడ్డి ఘాట్‌ పనులను పరిశీలించారు. అయన వెంట వార్డెన్‌ బాలక్రిష్ణ ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement