breaking news
succesfully
-
అగ్ని-5 క్షిపణీ పరీక్ష విజయవంతం
సాక్షి, భువనేశ్వర్ : రక్షణ రంగంలో భారతదేశం అతి పెద్ద విజయం సాధించింది. అగ్ని-5 క్షిపణీ పరీక్ష విజయవంతమైంది. ఈ పరీక్షను ఒడిశాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఆదివారం డీఆర్డీఓ పరీక్షించింది. ఈ క్షిపణీని నాల్గోపాడ్ నుంచి ఉదయం 09.50కి ప్రయోగించారు. ఈ సంత్సరంలో ఆరుసార్లు విజయవంతంగా పరీక్షించారు. చివరగా ఈ సంవత్సరంలో జనవరి 18వ తేదీన ప్రయోగించినట్లు తెలుస్తోంది. 5వేల కిలోమీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాలను కూడా అగ్ని-5 క్షిపణీ ఛేదించగలదు. ఈ విజయంతో అమెరికా, చైనా, రష్యా సరసన భారత్ చేరింది. ఈ క్షిపణీ దాదాపుగా చైనాను కూడా కవర్ చేయగలిగే సామర్థ్యం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాజస్తాన్‌లోని థార్ ఎడారిలో మే11, 1998లో పొఖ్రాన్ న్యూక్లియర్ పరీక్షలు జరిగాయి. మే11, 2018 నాటికి న్యూక్లియర్ పరీక్ష జరిగి 20 సంవత్సరాలు పూర్తి అయింది. 1998 మే 11 తేదీల్లో రాజస్థాన్‌లోని పొఖ్రాన్ ప్రాంతంలో భారత్ ఐదు అణుపరీక్షలు నిర్వహించింది. -
పుష్కరాల విజయవంతానికి కృషి
దామరచర్ల : పుష్కరాల విజయ వంతానికి కృషి చేస్తామని వాడపల్లి శివాలయం ప్రధాన ఘాట్ ప్రత్యేక అధికారి ,జిల్లా స్టెప్ అధికారి కె.వేణుగోపాల్‌రావు తెలిపారు. మంగళవారం శ్రీమీనాక్షి అగస్తే్యశ్వర స్వామి దేవాలయంలో అధికారులు,దేవాలయ చైర్మన్‌తో కలిసి సమీక్ష జరిపారు. జిల్లాలో అత్యధికంగా ఈఘాట్‌కే పుష్కర భక్తులు వచ్చే వీలున్నందున దీనిపై ప్రత్యేక శ్రద్ధచూపుతామన్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.సమావేశంలో దేవాలయ చైర్మన్ కొందూటి సిద్దయ్య,ఆర్‌డబ్ల్యూయస్ డీఈ బ్రహ్మంబాబు,ఏఈలు సంపత్ కుమార్, రవికిర ణ్‌లు పాల్గొన్నారు. వాడపల్లి అయ్యప్ప ఘాట్ ప్రత్యేక అధికారి జిల్లా డీటీడబ్లు్యఓ నర్వోత్తమ్ రెడ్డి ఘాట్ పనులను పరిశీలించారు. అయన వెంట వార్డెన్ బాలక్రిష్ణ ఉన్నారు.