నాణ్యమైన భోజనం అందించాలి | Public school students Quality meal | Sakshi
Sakshi News home page

నాణ్యమైన భోజనం అందించాలి

Oct 25 2016 12:34 AM | Updated on Sep 4 2017 6:11 PM

నాణ్యమైన భోజనం అందించాలి

నాణ్యమైన భోజనం అందించాలి

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని మెదక్ డివిజన్ డిప్యూటీ డీఈఓ లింబాజీ అన్నారు.

పెద్దశంకరంపేట: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని మెదక్ డివిజన్ డిప్యూటీ డీఈఓ లింబాజీ అన్నారు. సోమవారం పెద్దశంకరంపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మధ్యాహ్న భోజనం, విద్యార్థుల హాజరుశాతం, పలు రికార్డులను తనిఖీ చేశారు.
 
 ఈనెల 17న ఎంపీపీ రాయిని సంగమేశ్వర్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత లేక పోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై డిప్యూటీ డీఈఓ స్పందించి వివరాలు సేకరించారు. వారంలో మూడు రోజులపాటు గుడ్లను అందించాలన్నారు. తనిఖీ సమయంలో ఎంఈఓ పోచయ్య, హెచ్‌ఎం రాజేశ్వర్, ఉపాధ్యాయులు చంద్రయ్య, రఘునాథ్‌రావు, విఠల్ తదితరులున్నారు.
 
 చిన్నశంకరంపేట: మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు వారానికి మూడు గుడ్లు ఇవ్వాలని చిన్నశంకరంపేట ఎంఈఓ బాల్‌చంద్రం తెలిపారు. సోమవారం మండలంలోని మల్లుపల్లి ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన నిర్వహణను పరిశీలించారు. తప్పనిసరిగా మధ్యాహ్న భోజనంలో మెను పాటించేలా ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎంఈఓ సందర్శించిన సమయంలో ప్రధానోపాధ్యాయుడు నరేష్ కుమార్, ఉపాధ్యాయురాలు స్వప్న ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement