breaking news
Quality meal
-
నాణ్యమైన భోజనం పెట్టాలి
మెదక్ రూరల్: విద్యార్థులు, గర్భిణులకు నాణ్యమైన భోజనం అందించాలని మెదక్ తహసీల్దార్ అమీనోద్దిన్ పేర్కొన్నారు. మంగళవారం మెదక్ మండలం రాయిన్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మల్కాపూర్ తండా అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖి చేశారు. ఈ సందర్భంగా బియ్యం, పప్పు, తాగునీరు, పిల్లలకు వడ్డిస్తున్న అన్నం, కూరలను పరిశీలించారు. వంటలు ఎలా ఉన్నాయని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి కేంద్రంలోని తాగునీటిని ఎమ్మార్వో స్వయంగా తాగి పరీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాలలో నాణ్యమైన భోజనం పెట్టాలని, శుభ్రమైన తాగునీటిని అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అలాగే సమయపాలన పాటించాలన్నారు. -
నాణ్యమైన భోజనం అందించాలి
పెద్దశంకరంపేట: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని మెదక్ డివిజన్ డిప్యూటీ డీఈఓ లింబాజీ అన్నారు. సోమవారం పెద్దశంకరంపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మధ్యాహ్న భోజనం, విద్యార్థుల హాజరుశాతం, పలు రికార్డులను తనిఖీ చేశారు. ఈనెల 17న ఎంపీపీ రాయిని సంగమేశ్వర్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత లేక పోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై డిప్యూటీ డీఈఓ స్పందించి వివరాలు సేకరించారు. వారంలో మూడు రోజులపాటు గుడ్లను అందించాలన్నారు. తనిఖీ సమయంలో ఎంఈఓ పోచయ్య, హెచ్ఎం రాజేశ్వర్, ఉపాధ్యాయులు చంద్రయ్య, రఘునాథ్‌రావు, విఠల్ తదితరులున్నారు. చిన్నశంకరంపేట: మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు వారానికి మూడు గుడ్లు ఇవ్వాలని చిన్నశంకరంపేట ఎంఈఓ బాల్‌చంద్రం తెలిపారు. సోమవారం మండలంలోని మల్లుపల్లి ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన నిర్వహణను పరిశీలించారు. తప్పనిసరిగా మధ్యాహ్న భోజనంలో మెను పాటించేలా ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎంఈఓ సందర్శించిన సమయంలో ప్రధానోపాధ్యాయుడు నరేష్ కుమార్, ఉపాధ్యాయురాలు స్వప్న ఉన్నారు.