విద్యార్థులు, గర్భిణులకు నాణ్యమైన భోజనం అందించాలని మెదక్ తహసీల్దార్ అమీనోద్దిన్ పేర్కొన్నారు. మంగళవారం మెదక్
నాణ్యమైన భోజనం పెట్టాలి
Nov 30 2016 1:37 AM | Updated on Oct 16 2018 3:12 PM
మెదక్ రూరల్: విద్యార్థులు, గర్భిణులకు నాణ్యమైన భోజనం అందించాలని మెదక్ తహసీల్దార్ అమీనోద్దిన్ పేర్కొన్నారు. మంగళవారం మెదక్ మండలం రాయిన్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మల్కాపూర్ తండా అంగన్‌వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖి చేశారు. ఈ సందర్భంగా బియ్యం, పప్పు, తాగునీరు, పిల్లలకు వడ్డిస్తున్న అన్నం, కూరలను పరిశీలించారు. వంటలు ఎలా ఉన్నాయని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడి కేంద్రంలోని తాగునీటిని ఎమ్మార్వో స్వయంగా తాగి పరీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అంగన్‌వాడి కేంద్రాలలో నాణ్యమైన భోజనం పెట్టాలని, శుభ్రమైన తాగునీటిని అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అలాగే సమయపాలన పాటించాలన్నారు.
Advertisement
Advertisement