మున్సిపల్ పాలకులు, అధికారులు ప్రజా ధనాన్ని వృథా చేయడం, స్వాహా చేయడంలో వారికెవరు సాటిరారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జనం డబ్బేగా.. మనది కాదుగా!
Aug 12 2016 7:52 PM | Updated on Sep 18 2018 6:32 PM
* వనం–మనం పేరుతో మొక్కల కొనుగోళ్ళు
* కల్యాణవేదిక ఆవరణలో పడేసిన వైనం
* ఎండిపోతున్న మొక్కలు
మంగళగిరి : మున్సిపల్ పాలకులు, అధికారులు ప్రజా ధనాన్ని వృథా చేయడం, స్వాహా చేయడంలో వారికెవరు సాటిరారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణాన్ని పచ్చదనంతో సుందరీకరించడంతో పాటు ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ‘వనం – మనం’ కార్యక్రమానికి మున్సిపాల్టీ ఆధ్వర్యంలో సుమారు 5 వేల మొక్కలను రూ 2.50 లక్షలతో కొనుగోలు చేశారు. తొలుత నాలుగు రోజులు మొక్కలు నాటుతూ ఫొటోలకు ఫోజులిచ్చి ఆర్భాటపు ప్రచారం చేసుకున్నారు. తర్వాత మిగిలిన మొక్కలను నాటలేదు. వాటిని వృథాగా పడేయడంతో అవి పూర్తిగా ఎండిపోతున్నాయి. వాటిని నసింహుడి కల్యాణ వేదిక ఆవరణలోని కళామండపం పక్కన పడేశారు. దీంతో ఆ మొక్కలకు నీరు లేక ఎండిపోతున్నాయి. కష్ణా పుష్కరాలు ప్రారంభం కానుండడంతో కల్యాణ వేదిక ఆవరణలో భక్తులకు దేవాదాయ శాఖ అధికారులు వసతి కల్పిస్తున్నారు. దీంతో మొక్కలు అడ్డంకిగా మారాయి. తీసుకెళ్లాని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆలయ సిబ్బంది చెబుతున్నారు.
Advertisement
Advertisement