కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని కోరుతూ గురువారం జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్‌కు పీఆర్‌టీయూ తెలంగాణ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
Sep 1 2016 11:01 PM | Updated on Jul 6 2019 4:04 PM
కరీంనగర్‌ఎడ్యుకేషన్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని కోరుతూ గురువారం జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్‌కు పీఆర్‌టీయూ తెలంగాణ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చోల్లేటి శ్రీనివాస్, పాతూరి రాజిరెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 1, 2014 నుంచి సీపీఎస్ పెన్షన్ విధానం అమల్లోకి వచ్చిన సందర్భంగా బ్లాక్‌డేగా పాటిస్తూ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గోనే శ్రీనివాస్, కార్యదర్శిసత్యనారాయణ పాల్గొన్నారు. సీపీఎస్ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీటి భూపతిరావు ఆధ్వర్యంలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సీపీఎస్ ఉద్యోగ సంఘం నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement