ప్రొఫెసర్ లక్ష్మి బెయిల్ పిటీషన్ కొట్టివేత | Professor Lakshmi bail petition Cancellation | Sakshi
Sakshi News home page

ప్రొఫెసర్ లక్ష్మి బెయిల్ పిటీషన్ కొట్టివేత

Nov 10 2016 2:30 AM | Updated on Sep 4 2017 7:39 PM

వేధింపులు తట్టుకోలేక గైనకాలజీ పీజీ విద్యార్థిని డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నిందితురాలైన

సాక్షి, గుంటూరు : వేధింపులు తట్టుకోలేక గైనకాలజీ పీజీ విద్యార్థిని డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నిందితురాలైన గుంటూరు జీజీహెచ్ ప్రొఫెసర్ లక్ష్మి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మూడో అదనపు జిల్లా న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. గతనెల 24వ తేదీ రాత్రి నుంచి ప్రొఫెసర్ లక్ష్మి పరారీలో ఉంది. ఈ నేపథ్యంలో ఫ్రొఫెసర్ లక్ష్మికి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆమె తరుఫు న్యాయవాది  గత నెల 29న గుంటూరు మూడో అదనపు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న మూడో అదనపు జిల్లా జడ్జి సత్యశ్రీ ప్రొఫెసర్ లక్ష్మి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్‌ను కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చారు.
 

Advertisement
 
Advertisement
Advertisement