జమ్మిపాళెలం ఇసుకరీచ్‌లో ఉద్రిక్తత | problem in sand reach | Sakshi
Sakshi News home page

జమ్మిపాళెలం ఇసుకరీచ్‌లో ఉద్రిక్తత

Jul 20 2016 12:17 AM | Updated on Sep 4 2017 5:19 AM

కోవూరు : మండలంలోని జమ్మిపాళెం ఇసుకరీచ్‌లో ఇరువర్గాలకు చెందిన కూలీల మధ్య వివాదం చోటుచేసుకుని ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

 
 కోవూరు : మండలంలోని జమ్మిపాళెం ఇసుకరీచ్‌లో ఇరువర్గాలకు చెందిన కూలీల మధ్య వివాదం చోటుచేసుకుని ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వివరాలు.. రీచ్‌లో గత కొంతకాలంగా జమ్మిపాళెంకు చెందిన కూలీలు మాత్రమే ఇసుకను లోడ్‌ చేస్తున్నారు. సమీప గ్రామాలకు చెందిన వారు మంగళవారం రీచ్‌ వద్దకు చేరుకుని తమకు కూడా రీచ్‌లో పనికల్పించాలని కోరారు. దీంతో ఇరువర్గాలకు చెందిన కూలీల మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న కోవూరు ఎస్సై వెంకట్రావ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement