తాగునీటి సమస్యపై పీఆర్కే చాలెంజ్‌ | prk challenge about drinking water | Sakshi
Sakshi News home page

తాగునీటి సమస్యపై పీఆర్కే చాలెంజ్‌

Jul 27 2016 7:58 PM | Updated on Sep 4 2017 6:35 AM

తాగునీటి సమస్యపై పీఆర్కే చాలెంజ్‌

తాగునీటి సమస్యపై పీఆర్కే చాలెంజ్‌

మాచర్ల: ‘అధికార పార్టీ నాయకులకు చాలెంజ్‌ చేసి చెబుతున్నా వారం రోజులు మున్సిపాలిటీని మాకు అప్పగించండి రూ.5 కోట్ల నిధులను తాగునీటి అవసరాలకు ఖర్చు పెట్టి నీటి సమస్యను పరిష్కరించి చూపుతాం, లేకపోతే ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేస్తా, ఈ సవాల్‌కు సిద్ధమేనా’ అని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

  •   మున్సిపాలిటీని వారం రోజులు అప్పగించండి
  •  నీళ్లిచ్చి చూపిస్తాం
  •  లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
  •  అధికార పార్టీ నేతలకు పీఆర్కే సవాల్‌
  •  పాలకవర్గం, అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మహాధర్నా   
  • మాచర్ల: ‘అధికార పార్టీ నాయకులకు చాలెంజ్‌ చేసి చెబుతున్నా వారం రోజులు మున్సిపాలిటీని మాకు అప్పగించండి రూ.5 కోట్ల నిధులను తాగునీటి అవసరాలకు ఖర్చు పెట్టి నీటి సమస్యను పరిష్కరించి చూపుతాం, లేకపోతే ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేస్తా, ఈ సవాల్‌కు సిద్ధమేనా’ అని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం బుధవారం మాచర్ల మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై ఆయన వేలమంది మహిళలు, కార్యకర్తలు, నాయకులతో కలిసి మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా లేని దౌర్భాగ్యం మాచర్ల మున్సిపాలిటీలో ఏర్పడిందన్నారు. అధికార పార్టీ వారు విభేదాలతో పర్సంటేజీల కోసం రూ.5 కోట్లను ఖర్చు పెట్టకుండా, నిధులను ఉంచుకొని నీటి సమస్యను పరిష్కరించకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. గతంలో మున్సిపాలిటీలో సమావేశాలు ఏర్పాటు చేసి నీటి సమస్య పరిష్కారం కోసం తాను సూచనలు చేసినా పట్టించుకోలేదన్నారు. గత నెల రోజులుగా నీటి కోసం జనం అల్లాడుతుంటే అధికారులు, టీడీపీ కౌన్సిలర్లు స్పందించకుండా రాత్రికిరాత్రి నీళ్ల ట్యాంకర్‌లను అమ్ముకుంటూ నీచరాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు.   మహిళలు పనులు మానుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు నీటి కోసం ఎదురు చూస్తున్నారన్నారు. పది రోజులలో నీటి సమస్యను పరిష్కరించకపోతే మున్సిపాలిటీని ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. అనంతరం  పార్టీ రాష్ట్ర  యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, జెడ్పీటీసీ గోపిరెడ్డి, నియోజకవర్గ నాయకులు శ్రీనివాసశర్మ, ఫ్లోర్‌ లీడర్‌ బోయ రఘురామిరెడ్డి మాట్లాడారు. ఉదయం 11 గంటల నుంచి 12.30 గంటల వరకు రోడ్డుపై బైఠాయించారు.  కలెక్టర్‌ కాంతిలాల్‌దండే, ఆర్డీ అనురాధలతో ఎమ్మెల్యే ఫో¯Œæలో మాట్లాడినా మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.శ్రీనివాసులు బయటకు రాకపోవడంతో రాస్తారోకోకు దిగారు. దీంతో సీఐ సత్యకైలాస్‌నాథ్‌ వచ్చి రాస్తారోకో విరమించాలని కోరారు. ఆందోళన విరమించకపోవడంతో అందరినీ బలవంతంగా పక్కకు లాగి రాస్తారోకో చేయకుండా అడ్డుకున్నారు. తొలుత వేలాది మంది మహిళలు, కార్యకర్తలు ఖాళీ బిందెలతో భారీ ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. కార్యక్రమంలో మున్సిపల్‌  మాజీ చైర్మన్లు బత్తుల ఏడుకొండలు, కామనబోయిన కోటయ్య, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్లు యరబోతుల శ్రీనివాసరావు, తాడి వెంకటేశ్వరరెడ్డి, పట్టణ యువజన అధ్యక్షుడు తురకా కిషోర్, జిల్లా కార్యదర్శులు జూలకంటి వీరారెడ్డి, మారం వాసు, బండారు పరమేశ్వరరావు, బీసీ సంఘ అధ్యక్షుడు బత్తిన వేణు, మైనార్టీ అధ్యక్షుడు సీలింగ్‌ బాషా, నాయకులు కందుకూరి రత్నరాజు, షేక్‌ కరిముల్లా, కౌన్సిలర్లు ఇంజమూరి రాణి, షేక్‌ కరిముల్లా, అనంతరావమ్మ, ఫర్వీన్, బిజ్జం నాగలక్ష్మి,  సుధాకరరెడ్డి, పోలా భారతి శ్రీనివాసరావు, ఓరుగంటి జయపాల్‌రెడ్డి, కుర్రి సాయిమార్కొండారెడ్డి, మహిళా అధ్యక్షురాలు బూదాల మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement