దొంగనోట్ల తయారీ ప్రింటర్‌ స్వాధీనం | Preparation of burglar notes person areest | Sakshi
Sakshi News home page

దొంగనోట్ల తయారీ ప్రింటర్‌ స్వాధీనం

Sep 6 2017 8:36 AM | Updated on May 25 2018 5:50 PM

దొంగనోట్ల తయారీ ప్రింటర్‌ స్వాధీనం - Sakshi

దొంగనోట్ల తయారీ ప్రింటర్‌ స్వాధీనం

దొంగనోట్ల తయారీకి వినియోగించే ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

డీఎస్పీ శ్రీనివాసులు
మైదుకూరు టౌన్‌ : దొంగనోట్ల తయారీకి వినియోగించే ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఇటీవల  బద్వేలు రోడ్డులో దొంగనోట్లు చలామనీ చేసే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.  వారిచ్చిన సమాచారం మేరకు  దొంగనోట్ల తయారీ కోసం ఉపయోగించే ప్రింటర్‌ను, కాగితాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలానికి చెందిన పి.చంద్రశేఖర్‌ హైదరాబాద్‌కు వెళ్లి ఆయిల్‌ ప్రింటింగ్‌ మిషన్లను తీసుకొచ్చి దొంగనోట్లను ముద్రించేవాడు.

వాటిని అక్కడక్కడా ఎవ్వరికీ అనుమానం రాకుండా మార్పిడి చేసేవాడు. దొంగనోట్లకోసం ఉపయోగించే కాగితాలను, ప్రింటర్‌ను, రూ.23,500 దొంగనోట్లను  స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.  ఈ కార్యక్రమంలో సీఐ హనుమంతనాయక్, హెడ్‌కానిస్టేబుల్‌ భాగ్యంరెడ్డి, గుర్రప్పలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement