యూనివర్సిటీ కన్వెన్షన్‌ పోస్టర్‌ విడుదల | poster release | Sakshi
Sakshi News home page

యూనివర్సిటీ కన్వెన్షన్‌ పోస్టర్‌ విడుదల

Aug 19 2016 9:27 PM | Updated on Sep 4 2017 9:58 AM

యూనివర్సిటీ కన్వెన్షన్‌ పోస్టర్‌ విడుదల

యూనివర్సిటీ కన్వెన్షన్‌ పోస్టర్‌ విడుదల

భారత విద్యార్థి ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర యూనివర్సిటీ కన్వెన్షన్‌ పోస్టర్‌ జేఎన్‌టీయూకేలో శుక్రవారం వర్సిటీ రిజిస్ట్రార్‌ సాయిబాబు ఆవిష్కరించారు. రిజిస్ట్రార్‌ సాయిబాబు మాట్లాడుతూ విద్యారంగంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ప్రపంచస్థాయి శాస్త్ర సాంకేతిక పురోగామి అభివృద్ధి చెందడానికి యూనివర్సిటీ విద్యలో కొన్ని మార్పులు తీసుకురావలసిన ఆవశ్యకత ఉందన్నారు.

బాలాజీచెరువు :
భారత విద్యార్థి ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర యూనివర్సిటీ కన్వెన్షన్‌ పోస్టర్‌ జేఎన్‌టీయూకేలో శుక్రవారం వర్సిటీ రిజిస్ట్రార్‌ సాయిబాబు ఆవిష్కరించారు. రిజిస్ట్రార్‌ సాయిబాబు మాట్లాడుతూ విద్యారంగంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ప్రపంచస్థాయి శాస్త్ర సాంకేతిక పురోగామి అభివృద్ధి చెందడానికి యూనివర్సిటీ విద్యలో కొన్ని మార్పులు తీసుకురావలసిన ఆవశ్యకత ఉందన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించే కన్వెన్షన్‌ సదస్సులు జయప్రదం చేయాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రసాద్‌రాజు మాట్లాడుతూ ఈ సదస్సులో యూనివర్సిటీ విద్యలో పరిశోధన రంగం ప్రా«ధాన్యాన్ని, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే టెక్నాలజీపై  చర్చించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వై.సురక్షిత, ఉదయ్, రాజా, తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement