పోస్టల్‌లో గోల్డ్‌ బాండు సేవలు | Sakshi
Sakshi News home page

పోస్టల్‌లో గోల్డ్‌ బాండు సేవలు

Published Tue, Nov 1 2016 12:06 AM

పోస్టల్‌లో గోల్డ్‌ బాండు సేవలు - Sakshi

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : పోస్టల్‌ శాఖ ఇకపై గోల్డ్‌ బాండు సేవలను అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సావరిన్‌ గోల్డ్‌ బాండు పథకంలో భాగంగా 6వ సారి పోస్టల్‌ శాఖలో ఈగోల్డ్‌ బాండు సేవలను ప్రవేశపెట్టింది. గోల్డ్‌ బాండు అమ్మకాలల్లో ప్రస్తుతం సాధారణ సగటు ధర రూ.2957 గా నిర్ణయించి అమ్మకాలు సాగిస్తున్నారు. కొనుగోలు దారులు 1 గ్రాము నుంచి 500 గ్రాముల వరకు గోల్డ్‌ బాండులను కొనవచ్చు. ఈ బాండుకు సంబంధించి వడ్డీ రేటు 2.50 వర్తిస్తుందన్నారు. బాండ్ల కాలపరిమితి 8 సంవత్సరాలు కాగా ఐదు సంవత్సరాల తర్వాత ఎప్పుడైన నగదుగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ప్రతి 6నెలలకు ఒకసారి కొనుగొలు దారుని బ్యాంక్‌ ఖాతాలో పిక్స్‌డ్‌ వడ్డీ జమ చేయడం జరుగుతుంది. కాలపరిమితి 8 సంవత్సరాల తర్వాత ఆసమయంలో మార్కెట్‌లో గల బంగారం ధర విలువలను నగదు రూపంలో పెట్టుబడిదారులకు అందిస్తారు. ఈ గోల్డ్‌ బాండు ద్వారా బ్యాంకుల్లో రుణ సదుపాయం పొందే వెసులు బాటు కల్పించింది. ఎవరైనా రూ. 20వేలు గోల్డ్‌ బాండుకు మించితే చెక్కు రూపంలో అందించాల్సి ఉంటుంది
5 వేల బాండ్ల అమ్మకాలు లక్ష్యం: పోస్టల్‌ శాఖ ఈ ఏడాది 5వేల గోల్డ్‌ బాండ్ల అమ్మకాలు లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇప్పటి వరకు 166 గోల్డ్‌ బాండులను అమ్మకాలు సాగించారు. జిల్లాలో కడప, రాజంపేట డివిజన్‌లు కాగా 395 బ్రాంచ్‌ పోస్టాపీసులు, 53 సబ్‌ పోస్టాఫీసులు ఉన్నాయి ఈ పరిధిలో కూడా గోల్డ్‌ బాండు సేవలను ఉపయోగించుకోవచ్చు.

Advertisement
Advertisement