తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై టీపీసీసీ మాజీ చీఫ్ పోన్నాల లక్ష్మయ్య నిప్పులు చెరిగారు.
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై టీపీసీసీ మాజీ చీఫ్ పోన్నాల లక్ష్మయ్య నిప్పులు చెరిగారు. బుధవారం వరంగల్లో పోన్నాల మాట్లాడుతూ... రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలను కేసీఆర్ అవమానిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి వెళ్తున్న కేసీఆర్ తెలంగాణ అమరవీరులను మరిచిపోయాడని పొన్నాల ఎద్దేవా చేశారు. రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అని పొన్నాల స్పష్టం చేశారు.