పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం | polytechnic student suicide attempt in tadepalligudem | Sakshi
Sakshi News home page

పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

Published Fri, Aug 5 2016 8:27 AM | Last Updated on Mon, Sep 17 2018 7:38 PM

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలోని వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ విద్యార్థి గురువారం రాత్రి ఆత్మహత్యకు యత్నించాడు.

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలోని వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ విద్యార్థి గురువారం రాత్రి ఆత్మహత్యకు యత్నించాడు. కళాశాల భవనంపై నుంచి కిందకి దూకాడు. దీంతో అతడు రక్తపు మడుగులో పడిపోయాడు. సహచర విద్యార్థులు వెంటనే స్పందించి... కళాశాల సిబ్బందికి సమాచారం అందించారు.

సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రుడిని విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా శుక్రవారం ఉదయం కళాశాలలోని విద్యార్థులను పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement